Breaking: ఎన్ఐఏకు విజయనగరం ఉగ్ర కుట్ర కేసు బదిలీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-28 05:02:36  IST  )

విజయనగరం ఉగ్ర కుట్ర కేసును ప్రభుత్వం ఎన్ఐఏకు బదిలీ చేసింది...

Breaking: ఎన్ఐఏకు విజయనగరం ఉగ్ర కుట్ర కేసు బదిలీ
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం ఉగ్ర కుట్ర కేసు(Vizianagaram terror conspiracy case)ను ప్రభుత్వం ఎన్ఐఏ(NIA)కు బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వుల జారీ చేసింది. కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు కొద్ది రోజుల క్రితం విజయనగరంలో ఇద్దరు ఉగ్రవాదులను స్థానిక పోలీసులతో కలిసి ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, ముంబై, ఢిల్లీలో పేలుళ్లకు ప్లాన్ చేస్తున్న సిరాజ్‌తో పాటు సమీర్ అనే యువకులను విచారించారు. దీంతో పేలుళ్ల కుట్ర భగ్నమైంది. అయితే అప్పట్లోనే ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణను ఎన్ఐఏ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. రాష్ట్ర పరిధిలోనూ మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు సైతం విచారణ చేపట్టారు. అయితే ఈ కేసును పూర్తిగా ఎన్ఐకు బదిలీ చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story