టెట్ పై సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటిషన్

by Muthe.Rajitha |

టీచర్లందరికీ టెట్ ఉతీర్ణత తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్ట్ తీర్పినిచ్చిన సంగతి తెలిసిందే.

టెట్ పై సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్ : టీచర్లందరికీ టెట్ ఉతీర్ణత తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్ట్ తీర్పినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం తీర్పుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది. ఉపాధ్యాయ పరీక్ష అర్హతకు టెట్ పరీక్షను 2011 లో ప్రవేశ పెట్టారు. తాజాగా టీచర్లందరూ రెండేళ్లలో టెట్ పాస్ అవ్వాల్సిందేనని తీర్పు ఇవ్వడంతో.. 2011 కంటే ముందు నుంచి ఎన్నో ఏళ్లుగా సర్వీసులో ఉన్నవారు సుప్రీం నిబంధనపై ఆందోళన చెందుతున్నారు.

టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల ప్రత్యేక వినతితో.. 2011 కంటే ముందు విధుల్లో చేరిన వారికి టెట్ ఉతీర్ణత మినహాయింపు ఇవ్వాలంటూ ఏపీ సర్కారు పిటిషన్ దాఖలు చేసింది. లక్షలాది టీచర్ల సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బెంచ్ కు వెళ్లాల్సి వచ్చిందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా ఇటీవలే ఏపీ టెట్ పరీక్ష నిర్వహించగా.. లక్షలాది అభ్యర్థులు పరీక్ష రాశారు. వీరిలో డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవారితోపాటి టీచర్లు కూడా ఉన్నారు.

Next Story