- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో రెండో విడత భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కీలకమైన ప్రాజెక్టుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కీలకమైన ప్రాజెక్టుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకోసం రెండో విడత భూసేకరణకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఏడు గ్రామాల్లో సుమారు 16,666.57 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పట్టా భూములు, అసైన్డ్ భూములను సేకరించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. భారీ మొత్తంలో భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆ ఏడు గ్రామాలలో ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఈ భూసేకరణ ప్రక్రియ యొక్క పూర్తి బాధ్యతను ప్రభుత్వం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) కు అప్పగిస్తూ నిర్ణయించింది. ఈ భూములను ఏ ప్రాజెక్టుల కోసం ఉపయోగిస్తారు, రైతులకు ఎలాంటి పరిహారం అందిస్తారు అనే అంశాలపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అభివృద్ధి పనుల వేగం పెంచే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని భావిస్తున్నప్పటికీ, ఇంత పెద్ద ఎత్తున భూమిని సమీకరించేందుకు CRDA సిద్ధం కావడం రాష్ట్రంలో ముఖ్యమైన పరిణామంగా పరిగణించబడుతోంది.






