- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో డ్రగ్స్ కలకలం.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
విశాఖలో మరోసారి డ్రగ్స్(Drugs) కలకలం రేపాయి. విశాఖ వ్యాప్తంగా ఈగల్ టీం, సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం విస్తృతంగా దాడులు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో మరోసారి డ్రగ్స్(Drugs) కలకలం రేపాయి. విశాఖ వ్యాప్తంగా ఈగల్ టీం, సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం విస్తృతంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్న చరణ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. చరణ్‌ని పోలీసులు విచారించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పట్టుబడిన డ్రగ్స్‌తో వైసీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డికి లింక్ ఉన్నట్లు తేలింది. దీంతో కొండారెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే డ్రగ్స్ పట్టుబడటంపై టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Butchaiah Chowdhury) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టు పెట్టారు.
‘మరోసారి డ్రగ్స్‌తో వైసీపీ దొంగలు దొరికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ, రాష్ట్ర ప్రభుత్వం క్యాంపెయిన్ ఉద్యమంలా చేపట్టి యువతను రక్షిస్తుంటే, వైసీపీ పార్టీ మాత్రం, యువతని డ్రగ్స్‌కి బానిసలుగా మార్చటానికి, అనేక ప్రయత్నాలు చేస్తోంది.. కానీ ఈగల్ టీం వాళ్ళకు చెక్ పెడుతోంది. బెంగళూరు నుంచి Duronto Express రైలులో విశాఖపట్నానికి వస్తుండగా, చరణ్ అనే వ్యక్తిని ఈగల్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్ కలిసి పట్టుకున్నాయి. అతని వద్ద నుండి 36 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, ఈ స్ట్రిప్స్‌ను వైఎస్సార్‌సీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డి కోసం తీసుకువస్తున్నట్టు వెల్లడైంది. అనంతరం కొండా రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతని డ్రగ్స్ బానిసలుగా మార్చటానికి, వైసీపీ విద్యార్థి విభాగం నేతలే రంగంలోకి దిగటంతో, ఆ పార్టీ సమాజానికి ఎంత ప్రమాదకరమో అర్ధమవుతుంది’ అని బుచ్చయ్య చౌదరి ట్వీట్‌లో పేర్కొన్నారు.






