TDP: జమిలి ఎన్నికలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

జమిలి ఎన్నికల(Jamili Elections)పై టీడీపీ(TDP) కీలక నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Butchaiah Chowdary) కీలక వ్యాఖ్యలు చేశారు.

TDP: జమిలి ఎన్నికలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జమిలి ఎన్నికల(Jamili Elections)పై టీడీపీ(TDP) కీలక నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Butchaiah Chowdary) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రాలు అంగీకరిస్తేనే జమిలి ఎన్నికలు ఉంటాయని అన్నారు. ప్రజలు ఐదేళ్లు అవకాశం ఇస్తే జగన్‌(Jagan) అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారని మండిపడ్డారు. అధిక ధరకు బొగ్గు కొని ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. గత ప్రభుత్వ తప్పుడు విధానాలతో ఛార్జీలు పెరిగాయని తెలిపారు. విద్యుత్ ఛార్జీలపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదని అన్నారు. విద్యుత్ రంగం(Electricity Sector) గాడిలో పడేందుకు మరింత సమయం పడుతుందని తెలిపారు. త్వరలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని కీలక ప్రకటన చేశారు.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఒకే దేశం - ఒకే ఎన్నిక బిల్లు ఎట్టకేలకు పార్లమెంటు ముందుకు వచ్చింది. చాలా కాలంగా తర్జన భర్జనలు చేసిన కేంద్రం డిసెంబర్ 17వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీని కోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, ‘ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు’ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ లోక్‌సభ ముందుకు తీసుకొచ్చారు.

Next Story