సర్పంచ్‌లకు అదిరిపోయే ప్రభుత్వం గుడ్ న్యూస్

by velandi.Saikiran |

ఏపీ స‌ర్పంచుల‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ గుడ్ న్యూస్. 15వ ఆర్థిక సంఘం నిధులు వాడుకునే ఛాన్స్ ఇచ్చిన సర్కార్‌.

సర్పంచ్‌లకు అదిరిపోయే ప్రభుత్వం గుడ్ న్యూస్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సర్పంచులకు అదిరిపోయే శుభవార్త అందింది. నిధుల కోసం కొట్టుమిట్టాడుతున్న సర్పంచులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు అనుమతి ఇస్తూ అధికారిక ప్రకటన చేసింది కూటమి సర్కార్. ఇందులో భాగంగానే ఏపీలోని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

జనవరి 5వ తేదీన చేసిన తీర్మానాల మేరకు నిధులు వినియోగించుకోవాలని ఈ ఉత్తర్వులలో స్పష్టంగా వెల్లడించింది కూటమి సర్కార్. ఇప్పటికే పనులు చేసి, బిల్లుల కోసం రూల్స్ ప్రకారం నమోదు చేసుకున్న వాళ్లకు బిల్లులు ఇవ్వవచ్చని కూడా వెల్లడించింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఇక లేటెస్ట్ గా ఏపీలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సర్పంచులకు భారీ ఊరట లభించింది. ఈ నిర్ణయంతో ఏపీలో ఉన్న పంచాయితీలలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు కూడా వేగవంతం కాబోతున్నాయి. ఈ ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఏపీలోని సర్పంచులకు ఊరట లభించనుంది.

ఆర్థిక వ్యవస్థపై పయ్యావుల కేశవ్ ప్రకటన

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి పయ్యావుల కేశవ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం, ప్రతి శాఖలో కూడా పీకల లోతు బకాయిలు మిగిల్చి వెళ్లిందని ఫైర్ అయ్యారు. వాటిని కట్టెందుకే తమ కూటమి సర్కార్ నానా తంటాలు పడుతోందని వెల్లడించారు. ఎక్కువ వడ్డీలతో తెచ్చిన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేలా సంప్రదింపులు జరుపుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. సుమారు 2000 కోట్ల మేర వడ్డీలు తగ్గించేలా తమ కూటమి సర్కార్ అడుగులు వేస్తుందని వ్యాఖ్యానించారు. ఇక మిగిలిన డబ్బుతో చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి డౌట్ పడాల్సిన పనిలేదని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ పార్టీ హానికరమనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. వైసీపీ పార్టీ నెవర్ అగైన్, వన్స్ అగైన్ కూటమి అంటూ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు.

Next Story