- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala:శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ పాలకమండలి కీలక ప్రకటన
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు(Devotees) తిరుమల(Tirumala) కొండకు చేరుకుంటారు. ఈ తరుణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) పాలకమండలి గుడ్ న్యూస్ చెప్పింది.
ఇవాళ(సోమవారం) శ్రీవారి భక్తులకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లను టీటీడీ పాలకమండలి విడుదల చేయబోతోంది. ఈ రోజు(సోమవారం) ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్లు విడుదల చేయనున్నారు. 11 గంటలకు శ్రీవాణి దర్శనం టికెట్లు విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికాలంగుల దర్శన టికెట్లను టీటీడీ పాలకమండలి ఆన్‌లైన్‌లో విడుదల చేయబోతుంది. రేపు(మంగళవారం) ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ పాలకమండలి ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






