- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీనియర్ సిటిజన్స్‌కు గుడ్‌న్యూస్.. మన మిత్ర ద్వారా ఉచిత సేవలు
సీనియర్ సిటిజన్స్‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగిన సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి పాల్గొన్నారు..

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ సిటిజన్స్‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగిన సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి పాల్గొన్నారు. వయోవృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రతపై సమీక్షించారు. వాట్సప్ మన మిత్ర ద్వారా సీనియర్ సిటిజన్ కార్డులు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. సైబర్ నేరాల పట్ల వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని, ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు జరపాలని సూచించారు. వృద్ధులను ఆరోగ్యంగా ఉంచేందుకు ఆశ్రమల్లో వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2036 నాటికి ప్రతి 5 మందిలో ఒకరు వృద్ధుడు ఉంటారనే అంచనా అందని, దీన్ని అధిగమించేందుకే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీని తీసుకొస్తున్నారని తెలిపారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో సీనియర్ సిటిజన్‌కు రాయితీ, సీట్ల కేటాయింపు పటిష్టంగా అమలు చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.






