పదవీ విరమణ ఉద్యోగులకు గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

ఏపీ కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది.

పదవీ విరమణ ఉద్యోగులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. పదవీ విరమణ చేయబోయే ఉద్యోగుల సమస్యలకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ చేయబోయే ప్రభుత్వ ఉద్యోగులు పేపర్ వర్క్ విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వారి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇకపై ఆ పనులన్నీ డిజిటలైజ్ చేయబోతున్నట్టు తెలిపింది. అందుకోసం "రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్"ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనివల్ల పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు ఎదుర్కొనే ప్రక్రియలన్నీ తొలగిపోనున్నాయి. ఐటీ సిస్టమ్స్ ద్వారా CFMS, పెరోల్ వ్యవస్థలు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కి నేరుగా అనుసంధానం అయి ఉంటాయి. దీనితో ఉద్యోగులు వివిధ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం ఉండదు.

Next Story