ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు.. ముహూర్తం ఫిక్స్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-10 11:13:33  IST  )

ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది...

ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు.. ముహూర్తం ఫిక్స్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: ఆటో డ్రైవర్ల(Auto Drivers)కు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉచిత బస్సు ప్రయాణం(Free Bus Journey) వల్ల తాము నష్టపోతున్నామంటూ ఆవేదన చెందుతున్న ఆటో డ్రైవరన్నలకు ఉపశమనం కల్పిస్తూ ప్రకటన చేసింది. దసరా(Dassera) నుంచి ‘వాహన మిత్ర’(Vahana Mithra) అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ప్రకటించారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభ(Super Six.. Super Hit)లో ఆయన మాట్లాడారు. దసరా రోజున ఆటోడ్రైవర్లకు వాహన మిత్ర ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.


ఇటీవలే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ స్కీమ్ వల్ల తాము నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఉచితంగా మహిళలంతా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, తమకు బాడుగల లేక ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వాహన మిత్ర అమలు చేసి ఆర్థికంగా అండగా నిలబడాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభ వేదికగా ఆటో డ్రైవర్లకు తీపి కబురు అందించారు.

Next Story