ఏపీ రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయిస్‌కు గుడ్‌న్యూస్

by Naga Rani Yarlagadda |

ఆంధ్రప్రదేశ్ లో రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వారికి కూడా ఈహెచ్ఎస్

ఏపీ రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయిస్‌కు గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వారికి కూడా ఈహెచ్ఎస్ (Employees Health Scheme) వర్తింపజేయాలని నిర్ణయించింది. 2020 జనవరి 1 తర్వాత రిటైరైన ఆర్టీసీ ఉద్యోగస్తులందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుందని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే లైఫంతా రిటైర్డ్ ఉద్యోగితో పాటు అతని భార్యకు కూడా ఉచితంగా వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆర్టీసీ ఆస్పత్రుల్లోనూ ఉచితంగా వైద్యం, మందులు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

సూపరింటెండెంట్ కేటగిరీ వరకూ ప్రీమియం రూ.38,572, అసిస్టెంట్ మేనేజర్, ఆపై ర్యాంకు ఉన్నవారు రూ.51,429 చెల్లించాలని ఆదేశించింది. ఆర్టీసీ ఆస్పత్రుల సిఫారసు మేరకు ఈహెచ్ఎస్ ఆస్పత్రుల్లో చికిత్స అందించడంతో పాటు.. రెగ్యులర్ ఉద్యోగుల్లా రీయంబర్స్మెంట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కాగా.. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఆరోగ్య ప్రీమియంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆర్టీసీ సంఘాలు ఎన్ఎంయూ, ఈయూ హర్షం ప్రకటించాయి. సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్టీసీ ఎండీ, అధికారులకు ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.

Next Story