జర్నలిస్టులకు గుడ్ న్యూస్ : ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలివే!

by Disha Web Desk 21 |
Ys Jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కుల గణనకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు వెలగపూడి సచివాలయంలో శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ శాఖలు సమర్పించిన 38 ప్రతిపాదనలపై కేబినెట్ వాడి వేడిగా చర్చించింది. ఇందులో పెట్టుబడులు, ప్రోత్సాహక బోర్డులో పరిశ్రమల ఏర్పాటు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అలాగే 6,790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్రాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. మరోవైపు కర్నూలులో నేషనల్ లా వర్సిటీకి మరో 100 ఎకరాల భూ కేటాయింపునకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి అంశాలపైనా చర్చ జరుగుతుంది. అయిదేళ్లు అక్రిడిటేషన్ ఉన్న వారికి రెండు సెంట్లు భూమి ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకఅలాగే ఏపీలో పరిశ్రమలకు కొత్త భూ కేటాయింపు విధానానికి ఏపీ కేబినెట్ అంగీకారం తెలిపింది. అలాగే గ్రూప్ 1, గ్రూప్2 పోస్టుల భర్తీకి సైతం ఏపీ కేబినెట్ అంగీకారం తెలిపింది.

Next Story

Most Viewed