- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోవిందరాజ స్వామి ఆలయ గోపురం పనుల్లో గోల్ మాల్..
గత వైసీపీ హయాంలో జరిగిన పరకామణి చోరీ కేసు రన్నింగ్ లో ఉండగానే.. టీటీడీ దేవస్థానాల పరిధిలో మరో స్కాం (Scam) వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: గత వైసీపీ హయాంలో జరిగిన పరకామణి చోరీ కేసు రన్నింగ్ లో ఉండగానే.. టీటీడీ దేవస్థానాల పరిధిలో మరో స్కాం (Scam) వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో 50 కిలోల బంగారం పక్కదారి పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా కూడా వైసీపీ హయాంలోనే జరిగినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనుబంధ ఆలయాల్లో ఒకటి. గతంలో దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులను చేపట్టారు. అయితే ఆ పనుల్లో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గోవిందరాజ స్వామి వారి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేసే ప్రక్రియలో సుమారు 50 కిలోల బంగారం పక్కదారి పట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన కీలక వ్యక్తుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం లోతైన విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
9కి బదులు 2 లేయర్లతోనే సరిపెట్టారు!!
దాతలైన భక్తులు స్వామివారి పట్ల అపార దైవభక్తితో శ్రీ గోవిందరాజ స్వామి వారి విమాన గోపురానికి (Govindaraja Swamy Vimana Gopuram) పురాతన వైభవం తెచ్చేందుకు బంగారు తాపడం పను చేపట్టాలని తలచారు. దాతల సహకారంతో టీటీడీ అధికారులు పనులను చేపట్టారు. శాస్త్రం ప్రకారం గోవిందరాజ స్వామి వారికి గోపురానికి 9 లేయర్లలో బంగారు తాపడం చేయాల్సి ఉంది. కానీ కాంట్రాక్టు పొందిన సంస్థ వారు కేవలం 2 లేయర్లతోనే సరిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా నిబంధనలను గాలికొదిలేసి మరి పనులు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజిలెన్స్ ప్రాథమిక దర్యాప్తులో 9 లేయర్లకు సరిపడ బంగారాన్ని లెక్కల్లో చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం బంగారం విలువ 50 కోట్ల పైమాటే.
నాటి చైర్మన్ .. ఈవోలపై ఆరోపణలు
గోవిందరాజ స్వామి వారి దేవాలయ గోపురం బంగారు తాపడం పనులను నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి పర్యవేక్షించారు. వారి ప్రమేయంతోనే కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలనే డిమాండ్లు శ్రీవారి భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించినప్పటికీ.. వాస్తవాలు బయటకు రావాలంటే లోతైన విచారణ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఎవరి పాత్ర ఏమిటని తెలియాల్సి ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకవేళ వాస్తవంలో స్కాం జరిగితే నిందితులు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలనే వినతులు వస్తున్నాయి.






