శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం

by Anil Sikha |
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం
X

దిశ, శ్రీశైలం : శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ఇవాళ స్వామి వారి స్వర్ణరథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బంగారు రథంపై ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లు విహరించారు. రథోత్సవానికి ముందు ఏర్పాటు చేసిన కోలాటం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భక్తులు అధిక సంఖ్యలో స్వామి, అమ్మ వార్లను దర్శించుకుని పరవశించారు

Next Story

Most Viewed