- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోరు మీదున్న బంగారం ధరలు..!
అసలు తగ్గేదే లేదన్నట్లుగా బంగారం ధరలు (Gold Price) జోరు మీదున్నాయి. రోజురోజుకు పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్నట్లుగా బంగారం ధరలు పై పైకి దూసుకెళ్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : అసలు తగ్గేదే లేదన్నట్లుగా బంగారం ధరలు (Gold Price) జోరు మీదున్నాయి. రోజురోజుకు పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్నట్లుగా బంగారం ధరలు పై పైకి దూసుకెళ్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం ధరలు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. మళ్లీ ఒక్కసారిగా బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. వారం క్రింత వరకు తులం బంగారం ధర రూ.1.20 లక్షల వరకు పలికింది. ఇప్పుడు మరో పది వేల రూపాయలు పెరిగి రూ.1.30 లక్షలు దాటి ముందుకు పరుగులు తీస్తోంది. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో సామాన్యుడికి అది అందని ద్రాక్షగా మారే పరిస్థితి నెలకొంది. వెండి కూడా అదే కోవలో ఉండడంతో కళ్లు పెద్దవి చేసి చూడడం సామాన్యుడి వంతు అవుతోంది. నేడు దేశీయంగా బంగారం ధర 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.1,30,150 లు ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,19,300 లుగా ఉంది. వెండి కూడా కిలో రెండు లక్షల రూపాయలకు దరిదాపుల్లో ఉంది. నేడు మరింత పెరిగే లేక తగ్గే అవకాశం కూడా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశీయంగా బంగారం ధరలు
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,150 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,19,300లుగా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,150 కాగా 22 క్యారెట్ల ధర రూ.1,19,300లు పలుకుతోంది. చెన్నై, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కలకత్తాల్లో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,30,150, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,300లుగా ఉంది.






