- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Valentine's Day:బాయ్ ఫ్రెండ్ నంబర్ బ్లాక్ చేశాడని.. ప్రియురాలు షాకింగ్ డిసిషన్!
ప్రేమికుల రోజున(Valentine's Day) రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: ప్రేమికుల రోజున(Valentine's Day) రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. బాయ్‌ఫ్రెండ్(boyfriend) తనతో మాట్లాడటం లేదని.. ఎలాగైనా అతనితో మాట్లాడించాలంటూ ఓ యువతి పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బాయ్ ఫ్రెండ్ తన నంబర్ బ్లాక్ చేశాడని ఓ యువతి 100కు కాల్ చేసిన ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. ఇది విని పోలీసులు షాకయ్యారు.
‘‘అతను నాతో మాట్లాడటం లేదు. నంబర్ బ్లాక్ చేశాడు. మీరు వాడితో మాట్లాడి నా నంబర్ అన్‌బ్లాక్ చేయించండి’’ అని ఫోన్ రాగా గుత్తి PS బ్లూ కోల్ట్స్ పోలీసులు ఆమెను ఫోన్ ద్వారా సంప్రదించారు. అయితే తన ఇంటికి రావొద్దని నంబర్ అన్‌బ్లాక్ చేయిస్తే చాలని యువతి చెప్పింది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కావడంతో డయల్ 100 ద్వారా గురువారం వచ్చిన ఈ ఫిర్యాదును కంట్రోల్ రూం నుంచి లోకల్ పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ యువతి బాయ్ ఫ్రెండ్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశాడు. కానీ యువకుడు కాల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో పోలీసులు పోలీస్ స్టేషన్(Police Station)కు వచ్చి కంప్లైంట్ చేయాలని యువతికి సూచించారు.






