- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో రాజువెడ్స్ రాంబాయి సినిమా సీన్ రిపీట్.. ప్రియుడి భార్యకు వైరస్ ఇంజక్షన్ ఇచ్చిన ప్రియురాలు
ఏపీలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా సీన్ రిపీట్ అయ్యింది. ఇటీవల విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో హీరోయిన్ కు ఆమె తండ్రి హెచ్ఐవీ వైరస్ ఇంజక్షన్ ఇస్తాడు. తన కూతురు ప్రేమించినవాడిని మర్చిపోకపోవడంతో ఇద్దరినీ చంపేయాలని కూతురుకు వైరస్ ఇంజక్షన్ వేస్తాడు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా సీన్ రిపీట్ అయ్యింది. ఇటీవల విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో హీరోయిన్ కు ఆమె తండ్రి హెచ్ఐవీ వైరస్ ఇంజక్షన్ ఇస్తాడు. తన కూతురు ప్రేమించినవాడిని మర్చిపోకపోవడంతో ఇద్దరినీ చంపేయాలని కూతురుకు వైరస్ ఇంజక్షన్ వేస్తాడు. అయితే ఇప్పుడు ఏపీలో అచ్చం అలాంటి సీన్ రిపీట్ అయింది. ఈ దారుణం కర్నూలులో చోటు చేసుకుంది. ఈ నెల 9వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్న శ్రావణి అనే మహిళ స్కూటీపై వెళుతుంటే ప్లాన్ ప్రకారం ఆమెను బైక్ తో ఢీ కొట్టారు. అంతే కాకుండా అదే సమయంలో ప్లాన్ ప్రకారం ఇద్దరకు మహిళలు అక్కడకు చేరుకుని ఆస్పత్రికి తీసుకువెళుతున్నట్టు నటిస్తూ ఇంజక్షన్ ఇచ్చారు. తరవాత తేరుకున్న ప్రొఫెసర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆమె భర్తతో కలిసి చదువుకున్న మాజీ ప్రియురాలే ఈ పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు. హెచ్ఐవీ వైరస్ ను కలెక్ట్ చేసి మహిళకు ఇచ్చినట్టు నిర్దారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.






