- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియుడి ఇంటి ముందు ప్రేయసి ధర్నా
ప్రియుడి ఇంటి ముందు ప్రేయసి ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ సభ్య సమాజాన్ని వేడుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రియుడి ఇంటి ముందు ప్రేయసి ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ సభ్య సమాజాన్ని వేడుకుంది. నమ్మి మోసపోయిన తనకు అన్యాయం జరగకుండా చూడాలంటూ నిరసనను చేపట్టింది. ఈ బాధాకరమైన ఘటన ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ రూరల్ పరిధిలో ఉన్న కాకానినగర్ లో జరిగింది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.
13 ఏళ్ల పరిచయం.. ఆరేళ్లుగా ప్రేమ
బాధితురాలి కథనం ప్రకారం కైకలూరుకు చెందిన యువతికి జగ్గయ్యపేటకు చెందిన బాలు సత్యదేవ్ తో 13 ఏళ్ల క్రితమే పరిచయం ఏర్పడింది. చదువుకునే రోజుల్లో ఏర్పడిన పరిచయం వారి మధ్య బంధాన్ని బలపరిచింది. మాటలతో పాటు మనసులు కలవడంతో ఇరువురు గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
మాటిచ్చి.. దూరం పెడుతున్నాడు
వారి మధ్య ప్రేమ పెరగడంతో ఇరువురు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. సత్యదేవ్ కూడా తనను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని మాటిచ్చాడని బాధిత యువతి పేర్కొంటున్నారు. అయితే ఇటీవల అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని.. ఒకప్పుడు ఆదరించిన యువకుడి కుటుంబ సభ్యులు కూడా తననిప్పుడు పట్టించుకోవడం లేదని యువతి ఆరోపిస్తోంది. తనను ఎందుకు దూరం పెడుతున్నారో అర్థం కావడంలేదని వాపోయింది.
మరొకరితో వివాహ ప్రయత్నం
యువతి ఆరోపణల ప్రకారం తన ప్రియుడికి మరొకరికిచ్చి వివాహం చేసేందుకు యువకుడి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తనను వదిలేసి మరొకరితో సంబంధం కలపడానికి ప్రయత్నిస్తున్నారని యువతి తన గోడును వెల్లబోసుకుంటోంది. ప్రియుడే ప్రపంచంగా బ్రతికిన తనకు అన్యాయం చేయొద్దని సత్యదేవ్ కుటుంబ సభ్యులను వేడుకుంటోంది. తనకు న్యాయం చేసేవరకు నిరసనను విరమించుకోనని స్పష్టం చేస్తోంది.






