Ganta Srinivasa Rao: తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి.. పార్టీకి ఏం చేస్తాడు: ఎమ్మెల్యే గంటా సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి పార్టీకి ఏం చేస్తాడని మాజీ సీఎం జగన్‌ (Former CM Jagan)పై ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ganta Srinivasa Rao: తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి.. పార్టీకి ఏం చేస్తాడు: ఎమ్మెల్యే గంటా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి పార్టీకి ఏం చేస్తాడని మాజీ సీఎం జగన్‌ (Former CM Jagan)పై ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాడు పార్టీలో ఉన్న ముఖ్య నాయకులంతా నేడు జగన్ (Jagan) నిజ స్వరూపం తెలుసుకుని ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారని కామెంట్ చేశారు. త్వరలో చాలా మంది నేతలు వైసీపీ నుంచి ఇతర పార్టీ్ల్లో చేరే అవకాశాలు ఉన్నాయని బాంబు పేల్చారు.

తల్లి వైఎస్ విజయమ్మ (YS Vijayamma) రాసిన బహిరంగ లేఖతో వైసీపీ (YCP) పరువు, ప్రతిష్టలు మంటగలిశాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ (Jagan) అన్ని శాఖలను బ్రష్టు పట్టించారని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని నెరవేరుస్తూ ముందకెళ్తోందని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఉచిత సిలిండర్ పథకాన్ని ప్రారంభించిం విజయవంతంగా అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మాజీ సీఎం జగన్‌ (Former CM Jagan)పై 47 కేసులు ఉన్నాయని గంటా శ్రీనివాస రావు కామెంట్ చేశారు.

Next Story