- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింహాచలం పులిహోర ప్రసాదంలో నత్త.. ఘటనపై రంగంలోకి ఇంటెలిజెన్స్ వర్గాలు..?
విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి పులిహోర ప్రసాదంలో నత్త వచ్చిందని సోషల్ మీడియాలో గాజువాక భక్తులు పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. ..

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha) జిల్లా సింహాచలం అప్పన్నస్వామి పులిహోర ప్రసాదం(Pulihora Prasadam)లో నత్త వచ్చిందని సోషల్ మీడియాలో గాజువాక భక్తులు పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. ఈ నెల 29న తాము అప్పన్నను దర్శించుకుని ప్రసాదం కొనుగోలు చేశామని, అయితే నత్త కనిపించిందని పోస్టులో తెలిపారు. ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, అందువల్లే సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశామని తెలిపారు. దీంతో ఈ ఘటనపై దేవాదాయ శాఖ సీరియస్ అయింది. తక్షణమే విచారణ జరిపి నిజానిజాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. పులిహోర ప్రసాదంలో నత్త ఉండటం ఆరోపణలు మాత్రమేనని ఈవో సుజాత పేర్కొన్నారు. ఘటపై పూర్తి విచారణ జరిపి నివేదిక అందజేస్తామని ఆమె వెల్లడించారు.
మరోవైపు నత్త ఘటనపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆ పార్టీ నేతలు విమర్శించారు. నత్త వ్యవహారంలో ఆరోపణలు చేసిన భక్తులను విచారించాలని దేవస్థానం నిర్ణయించింది. దీంతో ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. పులిహోర ప్రసాదంలోకి నత్త ఎలా వచ్చిందనే అంశంపై ఆరా తీస్తున్నారు






