- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు రోజులతో పోలిస్తే ఇంధన సరఫరా మెరుగైంది: ఏపీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
గత రెండు రోజులతో పోలిస్తే రాష్ట్రంలో ఇంధన సరఫరా గణనీయంగా మెరుగుపడిందని, సాయంత్రానికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని ఏపీపీటీఎఫ్ (APPTF) రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గత రెండు రోజులతో పోలిస్తే రాష్ట్రంలో ఇంధన సరఫరా గణనీయంగా మెరుగుపడిందని, సాయంత్రానికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని ఏపీపీటీఎఫ్ (APPTF) రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లాల్లో కలెక్టర్లు, అధికారులు పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. గుంటూరు జిల్లాలోని 220 బంకులకు 52 ట్యాంకుల ద్వారా, ఎన్టీఆర్ జిల్లా గ్రామీణ ప్రాంతాలకు ఇంధనం సరఫరా అవుతున్నట్లు డీలర్ల సంఘం సమీక్షలో వెల్లడించారు.
వదంతులు నమ్మొద్దు.. ఆందోళన వద్దు
పెట్రోల్ ధరలు పెరుగుతాయని, కొరత ఏర్పడుతుందన్న వదంతులను నమ్మి వాహనదారులు ఒకేసారి ‘ఫుల్ ట్యాంక్’ చేయించుకోవడం వల్లే బంకుల్లో తాత్కాలికంగా ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయని పల్నాడు, ఏలూరు జిల్లాల కలెక్టర్లు కృతికా శుక్లా, వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, అనవసరంగా ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.
జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలు..
ఏలూరు జిల్లాలో రబీ ధాన్యం తరలించే వాహనాలకు, ఆక్వా రంగానికి ఇంధన సరఫరాలో అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. బంకుల్లో నిల్వలను ప్రతి రెండు గంటలకోసారి పర్యవేక్షిస్తున్నారు. పల్నాడు జిల్లాలో ఇంధన సరఫరా సమస్యల పరిష్కారం, ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నం. 08647 252999 ను అందుబాటులోకి తెచ్చారు. తిరుమలలో భక్తుల వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, రద్దీకి అనుగుణంగా తగినంత డీజిల్, పెట్రోల్ స్టాక్ అందుబాటులో ఉంచాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి బంకుల తనిఖీ అనంతరం సంబంధిత అధికారులను ఆదేశించారు.






