సీఐ సతీష్ కుమార్‌‌ని ప్లాన్ చేసి చంపేశారు: ఫ్రెండ్ రామాంజనేయులు

by Vemula.Srinu Prasad |

సతీష్ కుమార్‌ను ప్లాన్ చేసి చంపేశారని ఫ్రెండ్ రామాంజనేయులు తెలిపారు.

సీఐ సతీష్ కుమార్‌‌ని ప్లాన్ చేసి చంపేశారు: ఫ్రెండ్ రామాంజనేయులు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల పరకామణి అక్రమాల కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సీఐ సతీష్ కుమార్.. తాడిపత్రి నియోజకవర్గం జూటూరు - కోమలి గ్రామాల మధ్య శవమై తేలిన విషయం తెలిసిందే. అయితే పరకామణి కేసు వల్లే తన స్నేహితుడి ప్రాణం పోయిందని సతీష్ ఫ్రెండ్ రామాంజనేయులు ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని సతీశ్ కుమార్ తరచూ చెప్పేవాడని ఆయన తెలిపారు. సతీష్ సూసైడ్ చేసుకునే వ్యక్తి మాత్రం కాదని తేల్చి చెప్పారు. పై అధికారుల నుంచి తనకు తీవ్రమైన ఒత్తిడి ఉందని తనకు చెప్పేవాడని సతీష్ కుమార్ స్నేహితుడు రామాంజనేయులు పేర్కొన్నారు.

కాగా గుంతకల్లు రైల్వే రిజర్వ్ ఇన్స్ పెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సతీష్ కుమార్.. తాడిపత్రి నియోజకవర్గం జూటూరు - కోమలి గ్రామాల మధ్య శవమై తేలారు. దీంతో సతీష్ కుమార్ మృతదేహాన్ని డీఐజీ షిమోషి, ఎస్పీ జగదీష్ పరిశీలించారు. సీఐ సతీష్ కుమార్ ది హత్యా.. ఆత్మహత్య అన్న కోణంలో విచారణ చేపట్టారు. తిరుమల పరకామణి అక్రమాల కేసులో ఫిర్యాదుదారుడిగా సీఐ సతీష్ కుమార్ ఉన్నారు.

Next Story