- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో నేటి నుంచి HPV వ్యాక్సిన్ పంపిణీ.. 14 ఏళ్ల బాలికలకు కంపల్సరీ
14 ఏళ్ల బాలికలకు HPV వ్యాక్సిన్ ను ఫ్రీగా అందించేందుకు కేంద్రం నడుం బిగించింది. ఈ క్రమంలో ఏపీకి లక్షకు పైగా డోసుల్ని పంపింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఉన్న బాలికలు, మహిళలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా నివారించే చర్యల్లో భాగంగా నేటి నుంచి ఉచితంగా 14 ఏళ్ల వయసున్న బాలికలకు పంపిణీ వేయనున్నారు. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే 1,90,800 డోసులను రాష్ట్రానికి పంపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో 3.45 లక్షల మంది 14 ఏళ్ల బాలికలు ఉండగా.. వారందరికీ ఈ ఉచిత హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సిన్ ను అందించనున్నారు. వ్యాక్సిన్ వేయించుకునే బాలికల తల్లిదండ్రుల్లో ఒకరి అనుమతి తప్పనిసరి.
రాష్ట్రంలో ఉన్న 1645 ఆరోగ్యకేంద్రాల ద్వారా అర్హులైన బాలికలకు HPV వ్యాక్సిన్ వేసి సర్టిఫికేట్ కూడా ఇస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. విద్యా, మహిళాశిశు సంక్షేమ, ఇతర శాఖల సమన్వయంతో సుమారు 3 నెలలపాటు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ లెక్కల ప్రకారం దేశంలో 2021-25 సర్వైకల్ క్యాన్సర్ కేసులు పెరగ్గా.. పెరుగుతున్న క్యాన్సర్ల ముప్పులో ఇది రెండవ స్థానంలో ఉన్నట్లు వైద్యులు, అధికారులు గుర్తించారు.






