Thalassemia: ఏపీలో వారందరికీ ఉచితంగా రక్తమార్పిడి

by Thanuru Gopichand |

రాష్ట్రంలో 1900 మంది హిమోఫీలియా బాధితులున్నారు.. 2100 మంది త‌ల‌సీమియాతో... ఇదే సంఖ్యలో సికిల్ సెల్ ఎనీమియాతో బాధ‌ప‌డుతున్నారు..

Thalassemia: ఏపీలో వారందరికీ ఉచితంగా రక్తమార్పిడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ' రాష్ట్రంలో 1900 మంది హిమోఫీలియా బాధితులున్నారు.. 2100 మంది త‌ల‌సీమియాతో... ఇదే సంఖ్యలో సికిల్ సెల్ ఎనీమియాతో బాధ‌ప‌డుతున్నారు.. బాధితుల్ని గుర్తించి వారికి క్రమం తప్పకుండా ఉచితంగా రక్తమార్పిడి చేస్తున్నాం ' అని వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ (Minister Satyakumar) వెల్లడించారు. విజయవాడలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్త సంబంధిత (తలసేమియా, సికిల్ సెల్, హిమోఫిలియా) రుగ్మతలపై జరిగిన రాష్ట్రస్థాయి సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ముందస్తు రోగ నిర్ధారణ, సంరక్షణ ప్రణాళికలు, రక్త వ్యాధుల సమగ్ర నిర్వహణ కోసం విధానాల రూపకల్పనపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమం రక్త సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బాధితులకు స్క్రీనింగ్, చికిత్స అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆరోగ్య సంరక్షణలో దేశంలోనే ఏపీని ను అగ్రస్థానంలో నిల‌పాల‌న్నదే నా ఆకాంక్ష అని తెలిపారు.

జ‌న్యుప‌రంగా వార‌స‌త్వంగా వ‌స్తున్న వ్యాధి ఇది.. వ్యాధిని ముందుగా గుర్తించ‌డం చాలా ముఖ్యం అన్నారు. రాష్ట్రంలోని 5 ఐసిహెచ్‌య‌స్ సెంట‌ర్ల ద్వారా ముంద‌స్తు వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష చేస్తున్నామని వెల్లడించారు. వ్యాధి నిర్ణార‌ణ అయిన వారికి ప్ర‌భుత్వం ఉచితంగా చికిత్స అందిస్తుంద ని తెలిపారు. గిరిజ‌న ప్రాంతాల్లో 19 ల‌క్షల మందికి సికిల్ సెల్ (Sickle cell) ఎనీమియా స్క్రీనింగ్ చేయాల్సి ఉండ‌గా, 10 ల‌క్ష‌ల 50 వేల మందికి స్క్రీనింగ్ చేశారని వెల్లడించారు. ఇందులో 19,000 మంది పైగా క్యారియ‌ర్స్ ఉన్నారు.. 2100 మందికి వ్యాధి నిర్ధార‌ణ అయిందని తెలిపారు. జ‌న్యుప‌ర‌మైన సికిల్‌సెల్ ఎనీమియా స్క్రీనింగ్ త‌ర్వాత గుర్తింపు కార్డులిస్తున్నాం అన్నారు. నోడ‌లాఫిస‌ర్లకు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు రెండు రోజుల పాటు శిక్ష‌ణ ఉపయోగపడుతుందన్నారు

Next Story