- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంగుళం కూడా కదిలించలేరు: అమరావతిపై మాజీ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
‘‘ఆ రోజు చెప్పా ఈరోజు చెబుతున్నా. ఎవరు వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదిలించలేరు.’’అని మాజీ కేంద్రమంత్రి, ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. అమరావతి చట్టబద్ధత విషయంలో వైసీపీ నేతలు, ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు...

దిశ, వెబ్ డెస్క్: ‘‘ఆ రోజు చెప్పా ఈరోజు చెబుతున్నా. ఎవరు వచ్చినా అమరావతి(Amaravati)ని అంగుళం కూడా కదిలించలేరు.’’అని మాజీ కేంద్రమంత్రి, ఎమ్మెల్యే సుజనా చౌదరి(Former Union Minister, mla Sujana Chowdary) అన్నారు. అమరావతి చట్టబద్ధత విషయంలో వైసీపీ(YCP) నేతలు, ఆ పార్టీ అధినేత జగన్(Jagan) చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘జగన్ ఇప్పుడు మావి గన్ అని స్లోగన్ అందుకున్నారు. మావి గన్ కాదు మీరు ఏ గన్ తీసుకొచ్చినా అమరావతిని మాత్రం తాకలేరు. అమరావతిలో పదో వంతు కూడా ఎవరూ ముట్టుకోలేరు. అదేదో డైవర్షన్ పాలిటిక్స్‌గా మాట్లాడుంటారు కానీ, జగన్ కూడా కావాలని చెప్పి మాట్లాడారని నేను అనుకోను. ఆయన కు స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారో... రాజకీయంగా జగన్‌కు కూడా నష్టమే. ఆయనకి సలహాదారులు సరిగ్గా లేరేమో అని నాదొక అనుమానం, ఒకవేళ గనుక అది మాట్లాడి ఉంటే... ఏ గన్ వచ్చినా.... అమరావతి అభివృద్ధి ఆగదు.’’ అని సుజనా చౌదరి ధీమా వ్యక్తం చేశారు.






