వైఎస్ జగన్‌పై తెలంగాణ మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-25 15:37:42  IST  )

మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వివక్ష చూపించిందని, అందువల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు..

వైఎస్ జగన్‌పై తెలంగాణ మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Ys Rajasekhar Reddy) మృతి తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy)పై కాంగ్రెస్(Congress) పార్టీ అధిష్టానం వివక్ష చూపించిందని, అందువల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జగన్‌తో మాట్లాడి కన్విన్స్ చేసి ఉంటే ఆ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ఉండేదన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం జగన్‌ను పట్టించుకోలేదని, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో కనుచూపు మేర కనిపిచడంలేదని చెప్పారు. జగన్‌కు ఆనాడు జరిగిన వివక్షతతోనే కాంగ్రెస్ ఈనాటికి అనుభవిస్తోందన్నారు. వైఎస్ జగన్‌ను దూరం చేసుకోవడంతోనే కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయిందని, సీమాంధ్రలో పార్టీ ఉనికి కోల్పోయిందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story