- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: మాజీ ఎమ్మెల్యే వర్మ కీలక ప్రకటన
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఎట్టకేలకు అలక వీడారు...

దిశ, వెబ్ డెస్క్: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ(Former Pithapuram MLA Svsn Verma) ఎట్టకేలకు అలక వీడారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLA Quota MLC Elections) తనకు సీటు దక్కకపోవడంపై ఆయన అసంతృప్తి చెందారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena chief Pawan Kalyan) కోసం సీటు త్యాగం చేసిన తనకు ప్రాధాన్యత లేదని తన అనుచరుల వద్ద వాపోయారని ప్రచారం జరిగింది. దీంతో వర్మను సోమవారం కూటమి నాయకులు, కార్యకర్తలు కలిశారు. వర్మను బుజ్జగించారు. దీంతో ఆయన అలకపై వెనక్కి తగ్గారు.
అధికారం ఉన్నా లేకపోయినా 23 ఏళ్లుగా పిఠాపురం ప్రజలకు సేవ చేస్తున్నానని వర్మ తెలిపారు. తనకు ప్రజా సేవ చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అవకాశం కల్పించారన్నారు. ఇన్నేళ్లు ప్రజా సేవడం అనేదే తనకు గొప్ప పదవి అని చెప్పారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ఆదేశాలను తాను, పిఠాపురం టీడీపీ కుటుంబ సభ్యులు శిరస్సా వహిస్తామని వర్మ స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల్లా టీడీపీ అధినేత చంద్రబాబుతో ముందుకు వెళ్తున్నామన్నారు. టీడీపీ(Tdp) భవిష్యత్ రథ సారధి లోకేశ్ అని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేశ్ సూచనలతో పిఠాపురం కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఎప్పుడూ ఉంటామని వర్మ వెల్లడించారు.






