- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలకృష్ణ కామెంట్స్ డైవర్షన్ పాలిటిక్సే: మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు
యూరియా సమస్యను పక్కదోవ పట్టించడానికే అసెంబ్లీలో కామినేని, బాలకృష్ణ కామెంట్స్ చేశారని మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ముఖ్యమైన యూరియా(Urea) సమస్యను పక్కదోవ పట్టించడానికి చేసిన డైవర్షన్ పాలిటిక్సే అసెంబ్లీ(Assembly)లో కామినేని, బాలకృష్ణ కామెంట్స్ చేశారని మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు(Former Mla Sudhakarbabu) ఆరోపించారు. దీనిపై చిరంజీవి రియాక్షన్, నాగబాబు, పవన్ కల్యాణ్ రియాక్ట్ కాకపోవడం కావాలని చేసిన కుట్రగానే భావిస్తున్నామని తెలిపారు. . 16 సంవత్సరాలు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఇప్పటికీ P4 అంటున్నాడంటే, అతను పాలకుడిగా ఘోరంగా విఫలమయ్యానని ఒప్పుకున్నట్టేనని విమర్శించారు. చెత్త ఆలోచనలు అన్నీ చంద్రబాబుకే వస్తాయని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్‌ని తానే నిర్మించానని డబ్బా కొట్టుకొనే చంద్రబాబుకు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక మెడికల్ కాలేజీ పెట్టాలనే ఆలోచన ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఉద్దానం బాధితులపై ప్రపంచం మొత్తం తెలిసినా ఒక శాశ్వత పరిష్కారం చేయాలని ఎందుకు అనుకోలేదన్నారు. కేవలం యూరియా సమస్య, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వస్తున్న వ్యతిరేకతను తప్పుదోవ పట్టించడానికి అసెంబ్లీలో కొత్త నాటకానికి తెరలేపారని సుధాకర్ బాబు వ్యాఖ్యానించారు.






