ఆమెను నేను దూషించలేదు: కేతిరెడ్డి

by Vemula.Srinu Prasad |

జేసీ ప్రభాకర్ రెడ్డి భార్యను తాను దూషించలేదని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు..

ఆమెను నేను దూషించలేదు: కేతిరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ దివాకర్ రెడ్డి(Tadipatri Municipal Chairman JC Diwakar Reddy) కుటుంబాన్ని తానెప్పుడూ దూషించలేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి(Former YSRCP MLA Kethireddy Prabhakar Reddy) అన్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సె్స్ కేతిరెడ్డిగా రాజకీయాలు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ హయాంలోతమను, తమ కుటుంబాన్ని కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారని, ఇష్టమొచ్చినట్లు దూషణలు కూడా చేశారని ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. మీడియా ముఖంగానే కేతిరెడ్డికి పలుమార్లు వార్నింగులు సైతం ఇచ్చారు.

తాజాగా సైతం కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నిప్పులు చెరిగాయి. దీంతో కేతిరెడ్డి స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెట్టిన కేసుల్లో ఆధారాలున్నాయని, అవి తప్పుడివి కాదన్నారు. సుప్రీంకోర్టు నిషేధించిన వాహనాలను ఫోర్జరీ డాక్యుమెంట్లతో నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారని, అందువల్ల ఆయనపై 100కు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. జేసీ ట్రావెల్స్‌లో కుటుంబ సభ్యులు డైరెక్టర్లు ఉండటం వల్ల ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైనా కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. జేసీపై కేసులు రాజకీయ కక్ష సాధింపులు కాదని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ గ్రహించాలని సూచించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమను దూషించినట్టు నిరూపిస్తే ఆయన ఇంటికి వెళ్లి క్షమాపణ చెబుతానని కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు.

Next Story