- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి పేర్నినానికి మరోసారి ఊరట.. మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు
మాజీ మంత్రి పేర్నినానికి హైకోర్టులో మరోసారి ఊరట లభించింది...

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పేర్నినాని(Former Minister Perni Nani)కి హైకోర్టు(High Court)లో మరోసారి ఊరట లభించింది. రప్పా రప్పా అంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ముందస్తు రక్షణ కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ నెల 31 వరకు తొందరపాటు చర్యలు వద్దని ఆదేశించింది. అప్పటివరకూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
కాగా మాజీ మంత్రి పేర్ని నాని మూడు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రప్పా రప్పా అని చెప్పడం కాదని, రాత్రి రాత్రికి చేసేయాలంటూ పామర్రు(Pamarru)లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పేర్ని నానిపై రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ కేసుల్లో ముందస్తు బెయిల్(Anticipatory Bail) కోసం ఆయన ప్రయత్నాలు చేశారు. కానీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అరెస్ట్ నుంచి ముందస్తు రక్షణ కల్పించాలని కోరడంతో హైకోర్టు... ఈ నెల 31 వరకు సమయం ఇచ్చింది.






