- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Roja : మాజీ మంత్రి రోజా సంచలన ట్వీట్!
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజా(Former Minister Roja) ఏం చేసినా..ఏం మాట్లాడిన సంచలనమే...రచ్చ రచ్చనే. రాజకీయ ప్రత్యర్థులపై రోజా చేసే విమర్శల దాడులు తరుచు ఆమెను వివాదాల్లో..వార్తల్లో నిలబెడుతుంటాయి.

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజా(Former Minister Roja) ఏం చేసినా..ఏం మాట్లాడిన సంచలనమే...రచ్చ రచ్చనే. రాజకీయ ప్రత్యర్థులపై రోజా చేసే విమర్శల దాడులు తరుచు ఆమెను వివాదాల్లో..వార్తల్లో నిలబెడుతుంటాయి. తాజాగా రోజా చేసిన సంచలన ట్వీట్(Sensational Tweet) ఇప్పుడు ఏపీ రాజకీయా(AP Politics)ల్లో హాట్ టాపిక్ (Hot Topic)గా మారింది.
తన ఎక్స్ ఖాతాలో.. హెల్ప్ అనేది చాలా విచిత్రమైందని.. చేస్తే మర్చిపోతారు.. హెల్ప్ చెయ్యకపోతే గుర్తు పెట్టుకుంటారంటూ రోజా పోస్టు చేశారు. రోజా చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు రోజా ట్వీట్ లో మాటల వెనుక ఉద్ధేశమేంటన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రోజాకు జగనన్న హ్యాండ్ ఇచ్చాడా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
దీంతో రోజా ట్వీట్ వెనుక అర్థం ఏంటన్నది హాట్ టాపిక్ గా సాగుతోంది. నిన్ననే ఏపీ బడ్జెట్ ప్రతిపాదనలు, కేటాయింపులపై కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రోజా అంతలోనే నర్మగర్భమైన వ్యాఖ్యలతో ట్వీట్ చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. రోజాను వదిలించుకోవాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆలోచిస్తున్నారా...లేక మరేదైన అంశంపై ట్వీట్ చేశారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.






