వైసీపీ ఎంపీ అరెస్ట్.. మాజీ మంత్రి రోజా రియాక్షన్ ఇదే!

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-20 13:59:17  IST  )

ఏపీ(Andhra Pradesh) లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది

వైసీపీ ఎంపీ అరెస్ట్.. మాజీ మంత్రి రోజా రియాక్షన్ ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ కీలక నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి(Mithun Reddy)ని శనివారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిన్న సుమారు ఆరు గంటల విచారణ తర్వాత సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. ఈ క్రమంలో మిథున్ రెడ్డి అరెస్ట్ పై మాజీ మంత్రి రోజా స్పందించారు.

ఈ తరుణంలో మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నానని ఆమె తెలిపారు. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు చేసిన ఒక్క మంచి పని లేదని విమర్శించారు. ఆయన పాలన గురించి ఎవరూ ప్రశ్నించకూడదని లేని లిక్కర్ కేసును సృష్టించి ఇలా వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఆయన పాపం పండే రోజు కూడా వస్తుందని ఆమె హెచ్చరించారు. ఇప్పటివరకు మద్యం కుంభకోణంలో కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు.

Next Story