- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత.. స్పందించిన మాజీ మంత్రి
వైసీపీలోకి ఓ టీడీపీ సీనియర్ నేత చేరనున్నారని వార్తలు వైరల్ అవతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీలోకి ఓ టీడీపీ సీనియర్ నేత చేరనున్నారని వార్తలు వైరల్ అవతున్నాయి. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీలో చేరనున్నారనే ప్రచారం పై ఆయన ఇవాళ(శుక్రవారం) స్పందించారు. తాను పార్టీ మారుతానంటూ జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి.. ఆ ప్రచారం వైసీపీ కుట్రగా అనుమానించారు. ఈ తరుణంలో వైసీపీ పై టీడీపీ నేత దేవినేని తీవ్ర విమర్శలు గుప్పించారు. 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పిన ఫేక్ ప్రచారం ఇంకా మానలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇంతలా దిగజారాలా? జగన్ అంటూ ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఎన్ని కుట్రలు చేసినా కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు కలిసే ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి ఏడాదే "బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ" అమలు చేస్తుంటే వైఎస్ జగన్ తట్టుకోలేకపోతున్నారు. ఐదేళ్ల విధ్వంస, అరాచక పాలనలో చేసిన అవినీతి, తప్పులు బయట పడుతుంటే.. వైసీపీ కార్యకర్తలు, నాయకుల్ని ఉసిగొల్పి శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని చేసే దుర్మార్గాలను కూటమి ప్రభుత్వం కట్టడి చేస్తుందని ఆయన తెలిపారు.






