- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆంధ్రప్రదేశ్ నెక్ట్స్ సీఎం అతడే.. తేల్చిచెప్పిన మాజీ మంత్రి రావెల
జూన్ 4న వెలువడనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సారి ఆంధ్రప్రదేశ్‌లో ఏ

దిశ, వెబ్‌డెస్క్: జూన్ 4న వెలువడనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సారి ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికార పీఠం దక్కించుకుంటుంది..? నెక్ట్స్ ఏపీ సీఎం ఎవరూ..? అన్న చర్చలు పొలిటికల్ కారిడార్స్‌లో జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నేత రావెల కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో 70 శాతం మంది ప్రజలు వైసీపీకే పట్టం కట్టారని జోస్యం చెప్పారు. జగన్ మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్నారు. ఏపీలో స్పష్టమైన ఫలితాలు రాబోతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సెకండ్ టైమ్ జగన్ ఏపీ సీఎం కావడాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును టీడీపీ గౌరవించాలని ఈ సందర్భంగా రావెల హితవు పలికారు. ఇదిలా ఉండగా.. గెలుపుపై ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జనసేన ధీమా వ్యక్తం చేస్తుండగా.. అధికార వైసీపీ సైతం మరోసారి తామే గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇరు పార్టీలకు చెందిన నేతలు సీఎం ఎవరూ, ప్రమాణ స్వీకార తేదీలను కూడా అనౌన్స్ చేస్తున్నారు. మరీ ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. తదుపరి సీఎం ఎవరూ అన్నది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.






