- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబద్ధాలు మానుకోవాలి: టీడీపీ నేతలకు పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్
భోగాపురం ఎయిర్‌పోర్టుపై అబద్ధాలు మానుకోవాలని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు....

దిశ, వెబ్ డెస్క్: భోగాపురం ఎయిర్‌పోర్టు(Bhogapuram Airport)పై అబద్ధాలు మానుకోవాలని మాజీ మంత్రి పేర్నినాని(Former Minister Perninani) అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండ్ కావడంతో ఆ క్రెడిట్ అంతా తమదేనని టీడీపీ(Tdp) నేతలు చెప్పుకుంటున్నారు. దీంతో వారిపై పేర్నినాని విమర్శలు కురిపించారు. భోగాపురం ఎయిర్ పోర్టులో తమ హయాంలో అనుమతులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. అంతేకాదు ఆ క్రిడిట్ అంతా జగన్(Jagan)కే దక్కుందనే కోణంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు. భూసేకరణ లేకుండా భోగాపురం ఎయిర్ పోర్టుకు ఎలా కట్టారని ప్రశ్నించారు. ట్రయల్ రన్‌పై పుతిన్, ట్రంప్ రేంజ్‌లో షో చేశారని ఎద్దేవా చేశారు. శంకుస్థాపనకు క్రెడిట్ తీసుకోవడం సిగ్గుచేటు అని పేర్నినాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సింగపూర్ అమరావతి అని కబుర్లు చెప్పారని, రాజధాని రైతులకు ఇప్పటికీ ప్లాట్లు ఇవ్వలేదన్నారు. నీళ్లు తోడడం, చెట్లు కొట్టడం తప్ప ఏమీ లేదని విమర్శించారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఇంకా జైల్లో ఉన్నాడన్నారు. విశాఖ పెట్టుబడులు అన్నీ బోగస్ అని మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యానించారు.






