ఏం చేస్తావ్.. చేతనైతే ఉరి వేయ్: సీఐపై పేర్నినాని దురుసు ప్రవర్తన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-10 15:41:30  IST  )

మచిలీపట్నం సీఐపై మాజీ మంత్రి పేర్ని నాని దురుసుగా ప్రవర్తించారు...

ఏం చేస్తావ్.. చేతనైతే ఉరి వేయ్: సీఐపై పేర్నినాని దురుసు ప్రవర్తన
X

దిశ, వెబ్ డెస్క్: మెడికల్ కాలేజీల(Medical Colleges) నిర్మాణానికి పీపీపీ(PPP) విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రైవేటు కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. అయితే మచిలీపట్నంలో అనుమతి లేకుండా నిరసనలు వ్యక్తం చేయడంతో పలువురు వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న(Machilipatnam City President Mekala Subbanna) అరెస్ట్ చేశారు.

అయితే మచిలీపట్నం వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన సుబ్బన్న అరెస్ట్ పట్ల సీఐతో వాగ్వాదానికి దిగారు. సుబ్బన్నను ఏం చేస్తారో చేయండని, చేతనైతే ఉరి వేయించండని సీఐకు వేలు చూపిస్తూ మండిపడ్డారు. మాట్లాడాలని పిలిచి సుబ్బన్నను అరెస్ట్ చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. వైసీపీ కార్యకర్తలని రోజు స్టేషన్‌కి పిలిపించి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని ఇష్టమొచ్చినట్లు చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆక్షేపించారు. అయితే పేర్ని నాని వేలు చూపిస్తూ మాట్లాడటంపై పలువురు పోలీసులు ఖండించారు.

Next Story