గుడివాడ వన్ టౌన్ పీఎస్ కు కొడాలి నాని

by velandi.Saikiran |

వైసీపీ (YCP) సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కొడాలి నాని ( Kodali Nani) మళ్లీ బయటకు వచ్చారు. ఏపీలో వైసీపీ పార్టీ అధికారం

గుడివాడ వన్ టౌన్ పీఎస్ కు కొడాలి నాని
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ (YCP) సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కొడాలి నాని ( Kodali Nani) మళ్లీ బయటకు వచ్చారు. ఏపీలో వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత.. పూర్తిగా సైలెంట్ అయిన కొడాలి నాని ( Kodali nani).. తాజాగా మీడియా కంటపడ్డారు. గుడివాడ ( Gudiwada) వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తాజాగా కొడాలి నాని వచ్చారు. ముందస్తు బెయిల్ లో భాగంగా కోర్టు షరతుల మేరకు పోలీస్ స్టేషన్ లో సంతకాలు చేశారు కొడాలి నాని.

మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి చేసిన కేసులో కొడాలి నాని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది గుడివాడ కోర్టు. ఇందులో భాగంగానే ప్రతి నెల గుడివాడ పోలీస్ స్టేషన్ లో కొడాలి నాని సంతకం చేయాల్సి ఉంటుందట. ఈ తరుణంలోనే తాజాగా... వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు కొడాలి నాని వచ్చారు. కొడాలి నానితో పాటు ఆయన అనుచరులు కూడా.. వెంట ఉన్నారు. ఇది ఇలా ఉండగా గత నెల రోజుల కిందట కొడాలి నాని ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఆయనకు గుండెకు సంబంధించిన... ఆపరేషన్ ముంబైలో చేశారు.

Next Story