Nellore: మాజీ మంత్రి కాకాణికి బిగ్ షాక్.. పిటిషన్ కొట్టివేత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-20 13:26:33  IST  )

అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది....

Nellore: మాజీ మంత్రి కాకాణికి బిగ్ షాక్.. పిటిషన్ కొట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore District)లో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy)కి బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏ4 ముద్దాయిగా ఆయన జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ కోర్టు(SC,ST Court)లో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.

కాగా జగన్ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాలో జోరుగా అక్రమ మైనింగ్ జరిగింది. అయితే అప్పుడు మంత్రిగా పని చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు చెలరేగాయి. అయితే అప్పట్లోనే తెలుగుదేశం కార్యకర్తలు బహిరంగంగానే విమర్శించారు. కానీ వైసీపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ అంశం సంచలనంగా మారింది. టీడీపీ నేతల ఫిర్యాదుతో అక్రమ మైనింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దీంతో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్ విధించడంతో కాకాణిని జైలుకు తరలించారు.

Next Story