Ap: 50 ఏళ్ల కల సహకారం చేసిన జగన్..!

by Vemula.Srinu Prasad |

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైసీపీ హయాంలో 50 ఏళ్ల కలను సహకారం చేశారని అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పోర్టును ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

Ap: 50 ఏళ్ల కల సహకారం చేసిన జగన్..!
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) వైసీపీ(Ycp) హయాంలో 50 ఏళ్ల కలను సహకారం చేశారని అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పోర్టును ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Former Minister Bosta Satyanarayana) వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూటపేట పోర్టు పనులు ఆపేశారంటూ వైసీపీ నేతలు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

4 పోర్టులు నిర్మాణం చేపట్టాం..

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బొత్స మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 4 పోర్టులు నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. అందులో ఒకటి ప్రైవేటు పోర్టు అని, మిగిలినవి ప్రభుత్వానివని తెలిపారు. వలసలను నివారణించాలనే ఉద్దేశంతో మూలపేట పోర్టుకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రభుత్వం మారినంతమాత్రానా అభివృద్ధిని ఆపేస్తారా అని ప్రశ్నించారు. మూలపేట పోర్టు పూర్తి అయితే జగన్‌ను మంచి పేరు వస్తుందని పనులు నిలిపివేయడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వం కళ్లు తెలిపించేందుకే ‘మూలపేటకు పోదాం రండి’ కార్యక్రమం నిర్వహించామని బొత్స పేర్కొన్నారు. కూటమి నాయకులు వారి స్వార్ధం కోసమే పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ఏం చేస్తోందని బొత్స ప్రశ్నించారు.

Next Story