- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుడే చెప్పా.. వినలేదు: మాజీ సీఎం జగన్‌పై బాలినేని సంచలన వ్యాఖ్యలు
వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఖరిపై మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు...

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(Ycp Chief Jagan Mohan Reddy) వైఖరిపై మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరావు(Janasena leader Balineni Srinivasarao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ సీఎంగా బటన్లు నొక్కారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. జగన్ మూర్ఖపు నిర్ణయాల వల్లే గత ఎన్నికల్లో తాను ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. తన ఓటమికి వ్యక్తిగత కారణాలు ఏవీ లేవని బాలినేని స్పష్టం చేశారు.
జగన్‌కు అప్పుడే చెప్పా..
రాజధాని విషయంలో జగన్‌తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy)కి కూడా తాను గతంలోనే పలు సూచనలు చేశానని బాలినేని గుర్తు చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయం(Nagarjuna University) పరిసర ప్రాంతాల్లో రాజధానిని నిర్మించాలని తాను ఆనాడే చెప్పినప్పటికీ జగన్ పట్టించుకోలేదని మండిపడ్డారు. జగన్ మొండి వైఖరి వల్లే రాష్ట్రానికి, పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని బాలినేని ఆరోపించారు.
జగన్‌కు చేతకావడం లేదు..
వైసీపీని సరైన రీతిలో అభివృద్ధి చేయడం జగన్‌కు చేతకావడం లేదని బాలినేని విమర్శించారు. కేవలం అనాలోచిత నిర్ణయాలతోనే పార్టీని, రాష్ట్రాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ నాయకత్వ లోపాలు, ఒంటెద్దు పోకడల వల్లే నాయకులు, ప్రజలు ఆయనకు దూరమయ్యారని బాలినేని వ్యాఖ్యానించారు.






