వంద కాకపోతే వెయ్యి కేసులు పెట్టుకోండి: పోలీసులకు మాజీ మంత్రి అనిల్ సవాల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-30 14:05:12  IST  )

వంద కాకపోతే వెయ్యి కేసులు పెట్టుకోండని పోలీసులకు మాజీ మంత్రి అనిల్ సవాల్ విసిరారు.

వంద కాకపోతే వెయ్యి కేసులు పెట్టుకోండి: పోలీసులకు మాజీ మంత్రి అనిల్ సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు(Nellore)లో వైఎస్ జగన్(Ys Jagan) పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్(former Minister Anil kumar Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలందరూ నెల్లూరుకు రావాలని, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండని పోలీసులకు ఆయన సవాల్ విసిరారు. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలపై అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు నోటీసులివ్వడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వస్తే ఏం అవుతుందని ఆయన ప్రశ్నించారు. 100 కాకపోతే 1000 కేసులు పెట్టుకోండని ఛాలెంజ్ చేశారు. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడితే ముందు తాము జైలుకు వెళ్తామని అనిల్ కుమార్ చెప్పారు.

ప్రతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ నెల్లూరుకు రండి అని అనిల్ కుమార్ పిలుపు నిచ్చారు. నెల లేదా రెండు లేదా ఆరు నెలలు జైల్లో పెడతారని, అంతకు మించి ఏమీ చేయలేరు కదా అని వ్యాఖ్యానించారు. జగన్ రోడ్డెక్కితే వేలాదిమంది వస్తారని టీడీపీ నేతలకు భయమెందుకు అని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో రాజకీయాలను టీడీపీ నేతలు దిగజార్చారని మండిపడ్డారు. జగన్‌కు బలం లేదని టీడీపీ నేతలే అంటున్నారని చెప్పారు. జగన్ నెల్లూరు వస్తే టీడీపీ నేతలు చుచ్చు పోసుకుంటున్నారా అని అనిల్ కుమార్ ప్రశ్నించారు.

Next Story