- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పులకు లెక్కలేవి.. చంద్రబాబును ప్రశ్నించిన బొత్స
ప్రభుత్వ అప్పులపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నల వర్షం కురిపించారు..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర విభజనతో అప్పులపైనే ప్రభుత్వం నెట్టుకొస్తోంది. 2014-19లో చంద్రబాబు(Chandrababu) అయినా.. 2019-24లో జగన్(Jagan) అయినా అప్పులు మీదునే రాష్ట్రప్రభుత్వాన్ని నడిపారు. అయితే ఆయా సందర్భాల్లో అప్పులపై టీడీపీ(Tdp), వైసీపీ(Ycp) ప్రశ్నలు కురిపించాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రశ్నల వర్షం కురిపించాయి. ఇప్పుడు సైతం అదే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనను నెట్టుకొచ్చేందుకు అప్పులు చేస్తోంది. దీంతో ప్రభుత్వంపై వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈ అప్పులపై తాజాగా ఎమ్మెల్సీ బొత్స సత్యానారాయణ(Mlc Bosta Satyanarayana) విమర్శలు కురిపించారు. అంతేకాదు అప్పులపై లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల 66 వేలు కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. తాము అధికారంలోక ఉన్నప్పుడు అప్పులపై ఎప్పటికప్పుడు లెక్కలు చూపించామని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం చేసిన అప్పులను చెప్పడం లేదని విమర్శించారు. అప్పులపై పారదర్శకంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ. 2 లక్షల 66 వేల కోట్లు అప్పులు చేసినప్పటికీ సీఎం చంద్రబాబు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని ఎమ్మెల్సీ బొత్స విమర్శించారు.






