- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాల్మన్ హత్యపై ఆగ్రహం.. చంద్రబాబు పాలనపై బొత్స విమర్శలు
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu) పాలనపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Mlc Bosta Satyanarayana) మండిపడ్డారు. సంక్రాంతి(Sankranti) నేపథ్యంలో పెరిగిన మద్యం, భూములు, యూరియా ధరలపై ఆయన విమర్శలు కురిపించారు. అలాగే పల్నాడు జిల్లా పిన్నెల్లిలో జరిగిన సాల్మన్ హత్య ఘటనను ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. సంక్రాంతి పండగతో ఏ వర్షం కూడా సంతోషంగా లేదన్నారు. అన్ని ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ ఇప్పటి వరకూ చెల్లిందన్నారు. ఆరోగ్యశ్రీని అటకెక్కించారని వ్యాఖ్యానించారు. రెండు ఏళ్లుగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. గ్రామాల్లో బహిష్కరణలు పెరిగిపోయాయని చెప్పారు. దహన సంస్కారాలకూ ఆధార్ చూపించాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు.
సాల్మన్ హత్య పై బొత్స ఆగ్రహం
ఇక పిన్నెల్లిలో జరిగిన సాల్మన్ హత్య పై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. సాల్మన్ హత్య అత్యంత దారుణమని మండిపడ్డారు. కూటమి పాలనలో ప్రజా స్వామ్యం అమలవుతున్న తీరుని ప్రధాని మోడీ తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ బహిష్కరణలపై కూడా మోడీ స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు సామాన్యులకు ప్రభుత్వం వల్ల మేలు జరగడంలేదని బొత్స ఆరోపించారు.






