శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా: గంటా శ్రీనివాసరావు సంచలన ప్రకటన

by Vemula.Srinu Prasad |

శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన చేశారు..

శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా: గంటా శ్రీనివాసరావు సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మేనిఫెస్టో(Ycp)పై ఆ పార్టీ నేతలు చర్చకు సిద్ధమా అని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(TDP MLA Ganta Srinivasa Rao) సవాల్ విసిరారు. గత ప్రభుత్వం పీడ విరగడైన రోజు అంటూ విశాఖ(Visakhapatnam)లో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గంటా శ్రీనివాసరావు వైసీపీ నేతలపై ఫైర్ అయ్యాయి. వైసీపీ మేనిఫెస్టోలని 10లో ఐదు హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానని గంటా శ్రీనివాసరావు ఛాలెంజ్ చేశారు. ఊరందరిదీ ఒక దారి అయితే ఉలికి పిట్టది మరో దారి అన్నట్లుగా జగన్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. వెన్నుపోట్లు, కత్తిపోట్లకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలు సంచలనాత్మక తీర్పు ఈ రోజు అని, జగన్ వెన్నుపోటు అని హడావుడి చేయడం హాస్యాస్పదని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమని గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు.

Next Story