- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైల్లో ఉన్న అంబటి రాంబాబుకు ఇంటి భోజనం, ప్రత్యేక సదుపాయాలు
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రూల్స్ ప్రకారం జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని గుంటూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు రూల్స్ ప్రకారం జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని గుంటూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో(Rajahmundry Central Jail) తనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటూ అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపింది. ఇంటి నుంచి భోజనం, మంచం, బెడ్డు, దిండు, దోమతెర, ఎయిర్ కూలర్, అవసరమైన మందులు, మెడికల్ పర్యవేక్షణ, ప్రత్యేకమైన రూము ఏర్పాటు చేయాలని అంబటి రాంబాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. అంబటి మాజీ మంత్రి కాబట్టి అతనికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. అంబటి రాంబాబును ప్రత్యేక రిమాండ్ ఖైదీగా చూడాలని అధికారులకు సూచనలు చేసింది. మరోవైపు.. అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో పాటు, పోలీస్ కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈనెల 18వ తేదీకి తీర్పును రిజర్వ్ చేసింది.






