- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కీలక బాధ్యతలు
వైసీపీ(YCP) కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ(YCP) కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబుని నియమించారు. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి స్పందించిన రాంబాబు.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. తనను గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన జగన్‌కు రాంబాబు కృతజ్ఞతలు చెప్పారు. కాగా, వైఎస్ జగన్ కొద్దిరోజులుగా జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పార్టీ ఇంఛార్జ్‌లు, ముఖ్య నేతల్ని పిలిపించి పార్టీ పరిస్థితి, బలోపేతంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అవసరమైన మార్పులు చేస్తున్నారు.. త్వరలో మరికొన్ని మార్పులు, చేర్పులు ఉంటాయనే చర్చ కూడా నడుస్తోంది. ట్వీట్






