High Court: ఏబీవీకి ఊరట

by Vemula.Srinu Prasad |

మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది....

High Court: ఏబీవీకి ఊరట
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(AB Venkateswara Rao)కు రాష్ట్ర హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆయన గతంలో బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లకు సంబంధించి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై జగన్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది.

అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తాజాగా హైకోర్టు విచారణ చేపట్టింది. తీర్పును రిజర్వు చేసింది. అంతేకాదు విజయవాడ కోర్టు(Vijayawada Court)లో జరగాల్సిన విచారణపై స్టే విధించింది.

కాగా భద్రతా పరికాల కొనుగోలు వ్యవహారంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఏబీవీని గత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ పోరాటం చేశారు. దీంతో సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్వర్వులు వచ్చాయి. ఈ మేరకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అడిషనల్ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. వెంటనే ప్రభుత్వం మళ్లీ సస్పెండ్ చేసింది. ఈసారి క్యాట్‌ను ఆశ్రయించారు. అయితే పదవీ విరమణ రోజునే బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం పదవీ విరమణ చేశారు.

Next Story