కేరళ టూర్ ఎంజాయ్ చేస్తున్న ఏపీ మాజీ డిప్యూటీ సీఎం

by srinivas |
కేరళ టూర్ ఎంజాయ్ చేస్తున్న ఏపీ మాజీ డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో నేతలు, నాయకురాళ్లు రిలాక్స్ అయ్యారు. ఎన్నికల ముందు ప్రచారంతో బీజీగా గడిపారు. ఎండ, వాన లెక్క చేయకుండా ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం ఎన్నికలు అయిపోవడంతో ఎలాంటి టెన్షన్ లేకుండా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు. సరదాగా టూర్లకు వెళ్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు . ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీ వాణి కేరళ టూర్‌కు వెళ్లారు. అక్కడ ప్రకృతి అందాలను వీక్షిస్తూ సేద తీరుతున్నారు. కేరళలోని మన్నూరులో పుష్ప శ్రీ వాణి దంపతులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. దంపతులిద్దరూ సరదాగా కేరళ అందాలను తిలకిస్తున్నారు. ఎత్తు పల్లాల భూములు, లోయలు, కొండలు, పచ్చని పర్వత ప్రాంతాలు, కలియ తిరుగుతూ టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Next Story