- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ సీఎం జగన్ మేనమామకు షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు
మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan)కు స్వయానా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి (Ravindranath Reddy)కి తాజాగా టీటీడీ విజిలెన్స్ పోలీసులు షాకిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan)కు స్వయానా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి (Ravindranath Reddy)కి తాజాగా టీటీడీ విజిలెన్స్ పోలీసులు షాకిచ్చారు. ఏకంగా ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే, తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధిస్తూ ఇటీవల పాలకమండలి తీర్మానం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం శ్రీవారిని రవీంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం బయటకు వచ్చిన ఆయన పులివెందుల జడ్పీటీసీ బై ఎలక్షన్‌పై మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ వెంటే ఉన్నారని చెప్పేందుకు పులివెందుల ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని కామెంట్ చేశారు. కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. వైసీపీ కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడికి పాల్పడుతూ వారిని భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అయితే, రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీటీడీ (TTD) దృష్టికి వచ్చాయి. దీంతో శ్రీవారి ఆలయ ప్రాంగణంలో రాజకీయ ఆరోపణలు చేశారంటూ టీటీడీ విజిలెన్స్ పోలీసులు (TTD Vigilance Police) లీగల్ ఒపీనియన్ తీసుకుని రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.






