మాకు ఏం సంబంధం: వైఎస్ జగన్

by Vemula.Srinu Prasad |

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేశారని, ఆయనే క్షమాపణలు చెప్పాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు...

మాకు ఏం సంబంధం: వైఎస్ జగన్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల కల్తీ నెయ్యి(Tirumala adulterated ghee) వ్యవహారానికి తమ పార్టీకి ఏం సంబంధమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిFormer Chief Minister and YSRCP chief YS Jagan Mohan Reddy() అన్నారు. 2024 మే15న టీటీడీలో నెయ్యి సరాసరాకు సంబంధించిన టెండర్లను ఓకే చేసి, ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇచ్చారని, జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయని, ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని జగన్ గుర్తు చేశారు. అప్పటి నుంచే నెయ్యి సరఫరా ప్రారంభమైందని, జూన్ 12, 20, 25తోపాటు జులై 4న ఏఆర్ డెయిరీ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేసిందని, అవన్నీ ల్యాబ్ పరీక్షల్లో పాస్ అయ్యాయని, జులై 6,12వ తేదీల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్లలో నెయ్యి ఫెయిల్ కావడంతో వెనక్కి పంపారని, జులై 23న ల్యాబ్ రిపోర్టు వచ్చిందని, జులై 25న మరో నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపించారని జగన్ తెలిపారు.

జూలై 27న...

‘‘అయితే జూలై 27న ఆ ట్యాంకర్లను శ్రీకాళహస్తిలో వైష్ణవి డెయిరీకి సమీపంలో పార్క్‌ చేశారని, వాటినే మరో డెయిరీ పేరుతో ఆగస్టు, సెప్టెంబరులో తిరిగి టీటీడీకి పంపారని, అలా వచ్చిన నెయ్యిని వాడారని, సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కూడా రాసిందని చెప్పారు. వెనక్కి పంపిన ట్యాంకర్లు తిరిగి టీటీడీలోకి వస్తే, జరిగిన పరిణామాలు, జరిగిన తేదీలు చూస్తే మొత్తం ఇవన్నీ కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగాయని, మరి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? అని జగన్ ప్రశ్నించారు. జరిగిన తప్పులను ప్రశ్నిస్తే తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు. ఒక అబద్ధాన్ని సృష్టించి ప్రచారం చేశారని, లసలు కల్తీ నెయ్యి సరఫరాకు, వైసీపీకి ఏమాత్రం సంబంధంలేదని జగన్ తెలిపారు. సీబీఐ చార్జిషీటుకు సమాధానం చెప్పాల్సిందీ, చేసిన తపపులకు క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబునని జగన్ వ్యాఖ్యానించారు.

Next Story